నేరస్తులు ప్రవర్తన మార్చుకోవాలి
సిటీలో నేర ప్రవర్తన కల్గిన వాళ్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్(ఎగ్టిక్యూటివ్) హోదాలో నగర పోలీస్ కమిషనరేట్‌లో కోర్టును నిర్వహించారు.
- నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
- సిటీ కమిషనరేట్‌లో కోర్టు నిర్వహణ
సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సిటీలో నేర ప్రవర్తన కల్గిన వాళ్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్(ఎగ్టిక్యూటివ్) హోదాలో నగర పోలీస్ కమిషనరేట్‌లో కోర్టును నిర్వహించారు. కాలపత్తార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 12 మంది వివిధ కేసుల్లోని నేరస్తులకు, బంజారాహిల్స్ ఠాణా పరిధికి చెందిన మరో ఆరుగురికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇందులో కొందరు హత్యలు, నేరాలు చేసిన వాళ్లున్నారు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులున్నాయి. ప్రశాంతతకు భంగం కల్గిస్తే కఠిన చర్యలుంటాయని ప్రశాంతతతో పాటు సత్ప్రవర్తన కల్గిన వాళ్లుగా ఉండాలన్నారు. కనీసం సంవత్సరం పాటు మంచిప్రవర్తన కల్గిన వాళ్లుగా ఉంటే అదే అలవాటు అవుతుందన్నారు. ఈ మేరకు వారికి నుంచి ష్యూరిటీతో కూడిన సెక్యూరిటీ బాండ్లను జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

