నిమజ్జనం పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండండి
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
- రాత్రి వేళ బందోబస్తులో పాల్గొనండి
- పోలీసులకు సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం అర్ధరాత్రి తరువాత ఆయన ఓల్డ్‌సిటీలోని హుస్సేనీ ఆలం, కామాటిపురా, మొఘల్‌పురా తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించారు. అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, మండపాల నిర్వాహకులతో మాట్లాడారు.
పాయింట్ పుస్తకాలలో సంతకాలు చేశారు. వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అధికారులు రాత్రి వేళల్లో బందోబస్తులో పాల్గొంటూ మండపాల వద్ద వివరాలు సేకరిస్తూ ప్రజల భద్రతకు మేమున్నామనే భరోసానివ్వాలని సూచించారు. అలాగే హుస్సేన్‌సాగర్ పరిసరాలలో నిమజ్జనానికి తరలివచ్చే విగ్రహాల ర్యాలీలను పరిశీలిస్తుండాలని, తెల్లవారుజాము వరకు ఈ ర్యాలీలు కొనసాగుతుండటంతో ప్రతి ఒక్క అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

