హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్డౌన్ హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా అమలవుతోంది. రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో పర్యటించిన నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తన ట్విటర్ పేజీలో ఓ వీడియో షేర్ చేశారు. పాతబస్తీలో లాక్డౌన్ అమలవుతున్న తీరును వీడియోలో చూపించారు.
ఈ సందర్భంగా సీపీ ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించే, లాక్డౌన్ నిబంధనలను అత్యున్నత స్థాయిలో పాటించే పౌరులు ఉన్న నగరంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఐ లవ్ హైదరాబాద్. మరి మీరు? అంటూ సీపీ ట్వీట్లో పేర్కొన్నారు.
I feel proud to live in a city where the Citizens are so law abiding and demonstrating highest quality of compliance to the Lockdown rules. I love Hyderabad. Do you ? pic.twitter.com/KWUVpsNvHx
— C.V.ANAND, IPS (@CPHydCity) May 14, 2021