హైదరాబాద్ : నగరంలోని మీర్ చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. యూపీహెచ్సీ జాంబాగ్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆస్పత్రి తలపులు పగులగొట్టి.. 2 కంప్యూటర్లు, ఒక ఎల్ఈడీ టీవీ, 17 బాటిళ్ల కొవాగ్జిన్ టీకా, 27 బాటిళ్ల కొవిషీల్డ్ టీకాలతో పాటు మెడిసిన్స్‌ను దొంగిలించారు.
ఇవాళ ఉదయం ఆస్పత్రి వద్దకు చేరుకున్న సిబ్బంది.. తలుపులు విరిగి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో తక్షణమే మీర్‌చౌక్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.