మల్లేపల్లి : ప్రజలకు పరిశుభ్రతను అందించడానికి జీహెచ్ఎంసీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సీఎన్.రఘు ప్రసాద్ అన్నారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్ బడి మజీద్ ప్రాంతంలో కార్పొరేటర్ జాఫర్ ఖాన్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జాఫర్ ఖాన్ బాడీ మసీద్ పరిసర ప్రాంతాలలో చెత్త పేరుకొని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు.
రంజాన్ మాసం సమీపిస్తుండడంతో బస్తీలలో, కాలనీలలో చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. అదనంగా చెత్త తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయాలని జాఫర్ ఖాన్ కోరారు. దీనికి స్పందించిన అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Supreme Court: సీనియర్ల పేరు చెబితే వాయిదా వేస్తామా?. న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఫైర్
Mahayuti | మహాయుతి కూటమిలో విభేదాలు.. ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే..?
Chhatrapati Shivaji Maharaj | ఛత్రపతి శివాజీగా రిషబ్‌శెట్టి.. ఫస్ట్ లుక్ రిలీజ్