పటాన్ చెరు, జూన్ 23: ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు (Patancheru) డివిజన్లోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీతో పాటు పలు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్లాక్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వాకింగ్ ట్రాక్‌ను పరిశిలించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ రోజు వందలాది మంది వాకింగ్ చేసే వాకింగ్ ట్రాక్ పరిసర ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండాలని, ట్రాక్‌కి ఇరువైపుల పెరిగిన పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, చెత్తాచెదారం లేకుండా చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.
అదేవిధంగా చైతన్య నగర్ కాలనీ, గోకుల్ నగర్ కాలనీ, సీతారామపురం కాలనీలలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ పనులను పరిశీలించారు. నాణ్యతా లోపాలు లేకుండా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్, శ్రీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి, కంజర్ల గ్రామ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, చింతల్ బాయి సంజీవరెడ్డి, టైలర్ విజయ్, జనరల్ సెక్రెటరీ రవీంద్ర గిరి, తదితరులు పాల్గొన్నారు.