కాచిగూడ, ఏప్రిల్ 1: డివిజన్ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తున్నట్లు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డివిజన్ లోని కృష్ణనగర్ లో గత కొన్ని నెలలుగా ఉన్న మట్టికుప్పలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు కార్పొరేటర్లు ఫిర్యాదు చేయగా స్పందించిన కార్పొరేటర్ వెంటనే మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బందితో మట్టి కుప్పలను తొలగించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు త్వరితగతిన పనులు చేయాలని సూచించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంతకు ముందు కృష్ణా నగర్లోని ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం కార్పొరేటర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు.