జవహర్నగర్, మార్చి 4: సమగ్ర కుటుంబసర్వేలో పనిచేసి నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకులు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో జవహర్నగర్ కార్పొరేషన్ చెందిన పలువురు విద్యార్థులు, గృహిణులు సుమారు 288 మంది సర్వే చేసిన సంగతి విధితమే.
కష్టపడి పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కుటుంబసర్వేకు రూ. 150కోట్లు నిధులు కేటాయించామని చెప్పిన..
ఆడబిడ్డలను కార్యాలయల చుట్టూ తిప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం ఎన్యూమరేటర్లు, అఖిపలక్షం నాయకులు కమిషనర్ వసంతకు విన్నవించారు. స్పందించిన కమిషనర్ ఉన్నతాధికారులకు విన్నవించి త్వరలోనే ఎన్యూమరేటర్లకు డబ్బులు అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అహ్మద్పాషా, జక్కుల భాస్కర్, విక్రమ్, ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.