బొల్లారం,ఆగస్టు 27 : కరోనా నియంత్రణ కోసం కంటోన్మెంట్ లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నామని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా బోర్డు పరిధిలోని ఎనిమిదో వార్డు లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య,బోర్డు అధికారులతో కలిసి కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇంటింటి సర్వేలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండ్లను గుర్తించి స్టిక్కర్ అతికించాలని సూచించారు.కరోనా నివారణకు వ్యాక్సినేషన్ తప్పని సరిగా వేసుకోవాలని 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.