గ్యాస్ బుకింగ్ సక్సెస్.. కాదు..కాదు క్యాన్సిల్
వంట గ్యాస్(సిలిండర్) బుకింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండానే ఏజెన్సీలు సంబంధిత బుకింగ్‌ను క్యాన్సల్ చేస్తున్నాయి. అయితే గ్యాస్‌బండ కోసం ఎదురు చూసిచూసి గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు ఫోన్ చేస్తే బుకింగ్ క్యాన్సల్ అయ్యిందని.. మరోసారి బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు.
- మేడ్చల్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ కష్టాలు
- ఆన్లైన్లో బుక్ చేసుకున్న 12 రోజులైనా డెలివరీ కాని గ్యాస్ సిలిండర్లు
మేడ్చల్, జూలై 2(నమస్తే తెలంగాణ): వంట గ్యాస్(సిలిండర్) బుకింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండానే ఏజెన్సీలు సంబంధిత బుకింగ్‌ను క్యాన్సల్ చేస్తున్నాయి. అయితే గ్యాస్‌బండ కోసం ఎదురు చూసిచూసి గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు ఫోన్ చేస్తే బుకింగ్ క్యాన్సల్ అయ్యిందని.. మరోసారి బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. అయితే బుకింగ్ చేసిన 10 నుంచి 12 రోజుల వరకు బుకింగ్ క్యాన్సిల్ చేసిన విషయాన్ని చెప్పకుండా.. తామంతట తామే ఫోన్ చేస్తే చెప్పడం ఏమిటని వినియోగదారులు మండిపడుతున్నారు.
తాము కేవైసీ చేయించినప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండా బుకింగ్ క్యాన్సిల్ అవుతోందని వాపోతున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలలో 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అయితే వంట వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అధికారులు చేపుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గ్యాస్ బుకింగ్‌లను ఏజెన్సీలు క్యాన్సల్ చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర కంటే రూ.300-రూ.500 వరకు అధికంగా విక్రయిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

