టెండర్లలో పారదర్శకత పాటించడం లేదు
రాబోయే పండుగల వేళ అత్యవసర పనుల కేటాయింపులో బంధుప్రీతి, నామినేషన్ల పర్వానికి స్వస్తి పలకాలని జీహెచ్ఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బక్రీద్, బోనాలు, రంజాన్, వినాయక చవితి వంటి ప్రధాన పండుగల సందర్భంగా నిర్వహించే అత్యవసర పనులను ఓపెన్ టెండర్ విధానం ద్వారానే కేటాయించాలని కోరుతూ గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు.
- బల్దియా అధికారులకు కాంట్రాక్టర్ల ఫిర్యాదు
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ ): రాబోయే పండుగల వేళ అత్యవసర పనుల కేటాయింపులో బంధుప్రీతి, నామినేషన్ల పర్వానికి స్వస్తి పలకాలని జీహెచ్ఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బక్రీద్, బోనాలు, రంజాన్, వినాయక చవితి వంటి ప్రధాన పండుగల సందర్భంగా నిర్వహించే అత్యవసర పనులను ఓపెన్ టెండర్ విధానం ద్వారానే కేటాయించాలని కోరుతూ గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. పండుగలకు సంబంధించిన ప్రతి చిన్న అత్యవసర పనిని కూడా ఇంజనీరింగ్ విభాగం ద్వారా అధికారికంగా టెండర్లు పిలిచి మాత్రమే కేటాయించాలని కాంట్రాక్టర్ సాయి కిరణ్ కమిషనర్‌కు వివరించారు. నామినేషన్ పద్ధ్దతిని వీడి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశం కల్పిస్తేనే ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి తక్కువ ధరకే నాణ్యమైన పనులు జరుగుతాయని చెప్పారు. అనంతరం సీఈ సహదేవ్ రత్నాకర్‌ను కాంట్రాక్టర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు.
యూసుఫ్‌గూడలో కమిషనర్ కర్ణన్ పర్యటన
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం యూసుఫ్‌గూడ సర్కిల్లో అధికారులతో కలిసి పర్యటించారు. వేసవి కాలంలో పారిశుద్ధ్య కార్యకలాపాలు, కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా ఉదారంగా అల్పాహారం ఏర్పాటు చేస్తున్న జై ప్రకాష్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను కలిశారు. వారి సామాజిక సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

