కుత్బుల్లాపూర్, జూలై 19 : గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు అందుకుఅనుగుణంగా చర్యలు తీసుకుంటున్నా రు. కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్లలో వర్షం సమస్యలు తలెత్తకుండా నిత్యం అందుబాటులో ఉండేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 7995077957 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఒక్కఫోన్ చేస్తే.. వెంటనే అక్కడ మాన్సూన్ టీం బృందం వాలిపోయి సమస్యను పరిష్కరించనున్నారు.
అందుబాటులో సిబ్బంది..
ప్రధానంగా లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లు, కాలనీలు, నాలా పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్య లు తీసుకునేందుకు జంట సర్కిళ్ల పరిధిలో ప్రతి సర్కిల్‌కు 4 టీంలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కో టీంలో నలుగురు వ్యక్తులు.. రెండు సర్కిళ్లలో 8 టీంలు, 32 మంది మాన్సూన్ సిబ్బంది అందుబాటులో ఉన్నా రు. వీరితో పాటుగా నాలుగు ప్రత్యేక వాహనాలు, నాలు గు జేసీబీలు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడేలాంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించేందుకు ఇంజినీరింగ్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ముంపు ప్రాంతాల్లో సమస్య తగ్గినట్లే…
జంట సర్కిళ్ల పరిధిలో జీడిమెట్ల డివిజన్, గాజులరామారం డివిజన్లతో పాటు కుత్బుల్లాపూర్ డివిజన్లో ప్రతి ఏడాది వర్షం పడిన సందర్భంలో లోతట్టు ప్రాంతా లు పూర్తిగా జలమయంగా మారిపోయి.. ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు అలాంటి సమస్యకు శాశ్వ త పరిష్కారం లభించిందని అధికారులు చెబుతున్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలో పేట్ బషీరాబాద్, ఎన్సీఎల్ కాలనీ, అంగడిపేట, దండముడి, కుత్బుల్లాపూర్ డివిజన్లో ప్రసూననగర్, చింతల్, గాజులరామారం డివిజన్లో మహదేవపురం, శ్రీరామ్నగర్లలోని నాలా పరివాహక ప్రాంతాల్లో అత్యధిక వరదనీరు పొంగిపొర్లి ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడేవారు.. కానీ ఇప్పుడు ఎన్ఎన్డీపీ ఆధ్వర్యంలో నాలాల నిర్మాణాలు పూర్తికావడంతో గత ఏడాది ఎదురయ్యే సమస్యలు ఉత్పన్నం కావని అధికారులు చెబుతున్నారు.