అంబర్‌పేట, జూన్ 25: బాగ్‌అంబర్‌పేట డివిజన్ మల్లికార్జుననగర్, రామకృష్ణానగర్, ఎరుకలబస్తీల్లో 15 రోజులుగా నల్లాల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాటర్‌వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తున్నదనే విషయాన్ని కనుక్కొనేందుకు రోడ్డు తవ్వకాలు చేపట్టారు.
కానీ ఎక్కడ నీరు కలుషితమవుతుందో తెలియలేదు. ప్రస్తుతం 15 రోజులుగా కూడా మంచినీటి సరఫరాలో మురుగునీరు కలిసి వస్తున్నదని మల్లికార్జున్‌నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు చుక్క జగన్ తెలిపారు. అన్నిచోట్ల కూడా మంచినీరు నలుపు రంగులో వస్తున్నదని స్థానికులు తెలిపారన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేస్తే సరిపోదని, అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కోరారు.