Kollur double bedroom township | సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా సామూహిక గృహ సముదాయం.. అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరులో రూ. 1354.59 కోట్లతో ప్రభుత్వం ఎస్ +9, ఎస్ 10, ఏ+11 అంతస్తుల్లో 15,600 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్ షిప్‌గా నిర్మించింది. ఈ పేదల కలల సౌధాన్ని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లూరులో ఒకేచోట 15,600 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపపట్టారు. ఔటర్‌ను ఆనుకుని నిర్మాణమైన గృహ సముదాయం అబ్బురపరిచేలా ఈ నిర్మాణం జరిగింది.
సౌకర్యాలు: అంతర్గత సీసీ రోడ్డు, స్మార్ట్ వాటర్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీతో పాటు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం, స్ట్రీట్ లైట్లు, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాటు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, కమ్యూనిటీ కాంప్లెక్స్, పాఠశాల అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు, బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్ నిర్మాణం, వివిధ మతాల ప్రార్థనా స్థలాలు, షియర్ వాల్ సాంకేతిక నిర్మాణం, ప్రతి బ్లాకుకు రెండుమెట్ల దారి, ప్రతి మెట్లదారి 3 మీటర్ల వెడల్పుతో నిర్మాణం, ప్రతి బ్లాకుకు 8 మందిని తీసుకెళ్లే కెపాసిటీ కలిగిన రెండు లిఫ్టులు. 13.50 కిలోమీటర్ల మేర వీడీసీసీ రోడ్డు, 10.60 కిలోమీటర్ల పొడవులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 9 ఎంఎల్డీ సామర్థ్యంతో సీవరేజి ట్రిట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు), శాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్,10.05 కిలోమీటర్ల మేరలో పైపులైన్ నెట్వర్క్, 21వేల కిలోమీటర్లలో రిజర్వాయర్, 10.55 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, మూడు చోట్ల 118 షాపింగ్ కాంప్లెక్స్‌లు, వెజ్మార్కెట్లు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చారు.
కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్ల విశేషాలు