దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
చంపాపేట, ఏప్రిల్ 4 : నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అదే విధంగా చంపాపేట మానస గార్డెన్ లైన్లో నూతనంగా రూ.32లక్షలతో చేపట్టన్ను ట్రంకు లైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే, డివిజన్ కార్పొరేటర్ మధుసూదన్‌రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ ందర్భంగా మాట్లాడుతూ.. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్ గుప్తా, సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాంరెడ్డి, ధనంజయ్య, అల్వాల్‌రెడ్డి, మాధవరెడ్డి, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, నాయకులు మేక సురేందర్‌రెడ్డి, చేగోని మల్లేశ్ గౌడ్, నరేశ్, సరోజ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి..
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన మహా గణపతి విగ్రహ ఆవిష్కరణ సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హాజరై, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మధుసూదన్‌రెడ్డి తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత లు సత్యనారాయణగౌడ్, వంగ జగన్నాథ్‌రెడ్డి, ఆలయ అధ్యక్షుడు రాంభూపాల్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి బత్తుల శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి బిళ్లకంటి శ్రీనివాస్‌గుప్తా, సభ్యులు కిరణ్‌గుప్తా, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.