గోల్నాక, జనవరి 10 : నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ శాఖ ల అధికారులను సమన్వయ పరుస్తూ నాణ్యతలో రాజీపడకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొన్నా రు. దీంతో పాటు అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధిపై ఆరా తీశారు. ఇక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల వ్యవస్థను ఆధునీకరించాలని అన్నారు. మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి సంక్రాంతి లోగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచే యాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన చౌరస్తాలు, పార్కులు, ఆట స్థలాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులు శంకర్, ఫరీద్, మనోహర్, జలమండలి అధికారులు సతీశ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.