ఖైరతాబాద్, జనవరి 17 : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందని, దీనిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి మాట్లాడుతూ.. మలి దశ తెలం గాణ ఉద్యమం ఉవ్వేత్తున సాగుతున్నప్పుడే ఆంధ్రపాలకులు హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదన తెచ్చారని, నాడు తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారన్నారు. అప్పట్లో ఆంధ్రా లాబీయింగ్ వల్ల కేంద్రం పదేండ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌ను మళ్లీ తెలంగాణ నుంచి వేరు చేసేందుకు లాబీ రాజకీయాలు ప్రారంభించారని, తద్వారా ఈ ప్రాంతాన్ని దోచుకునే కు ట్రకు తెరలేపారన్నారు. ఈ కుట్రలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర ప్రభు త్వ పెద్దలంతా కలిసి పనిచేస్తున్నారని ఆరోపించా రు. చేపకింద నీరులా ఏర్పాట్లు సాగుతున్నాయని, ఫలితంగా తెలంగాణ అస్తిత్వం పూర్తిగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం జీఎస్డీపీ హైదరా బాద్ నుం చే వస్తుందని, దానిని లాక్కోవాలని కేంద్రం అడుగులు వేస్తుందని విమర్శించారు.
వెంటనే యూటీ ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రం మరోసారి అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కాం గ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను ఎలాగైనా తన హస్తం చేసుకోవాలన్న దురుద్దేశ్యంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, ఆయన శిష్యుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యూటీ కుట్రకు తెరలేపాడన్నారు. రాష్ట్రంలో లేని ఫైనాన్స్ ఎమర్జెన్సీ అంశా న్ని ముందుకు తీసుకువచ్చి చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఈ కుట్రలో భాగమయ్యాడన్నారు.
హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు తెలంగాణ తరహాలో మరో ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ .. హైదరాబాద్ చుట్టు పక్కల వేల ఎకరాల భూములను ప్రభుత్వం చెరబట్టిందని, రైతుల భూములను లా క్కుంటున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ, నగర విస్తీర్ణత పేరుతో ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం వల్ల రైతులు తమ భూములను కోల్పుతారని, వారికి డబ్బులు మూట చెప్పి ఆ వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారన్నారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.10,700 ఉండాల్సి ఉండగా రూ.7,600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.
కేం ద్ర ప్రభుత్వ పెద్దలు అమెరికాతో ఒప్పందం చేసుకొని పత్తి, ఇతర ఆహార దాన్యాల దిగుమతికి అంగీకారం చేసుకొని దిగుమతి సుంఖం కూడా తొలగించి ఇక్కడి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తద్వా రా రైతులను వ్యవసాయానికి దూ రం చేసి వారి భూములను దోచుకొని కార్పొరేట్లకు కట్టబెట్టె ప్రయ త్నం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 2, 3 ప్రకారం కేంద్రానికి యూటీగా మార్చే అధికారం ఉంటుందని, ఒక్కసారి కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే తెలంగాణ స్వేచ్ఛను కోల్పోతుందన్నారు. ఇక్కడ పరోక్షంగా రాష్ట్రపతి పాలన ఉంటుందని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారం కొనసాగుతుందన్నారు.
అసెంబ్లీలో చట్టం చేసినా అది అమలు చేసే హక్కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆర్థికంగా లక్షలాది కోట్ల నష్టం జరుగుతుందన్నారు. దీనిని అడ్డుకో వాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీలు, ప్రజా సంఘా లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చలపతి రావు, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి విజ య్, ఎంసీపీఐయూ నేత గాదగోని రవి, ఆర్ఎస్పీ నేత జానకి రాములు, అంబటి నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, తదితరులు పాల్గొన్నారు.