ఉస్మానియా యూనివర్సిటీ: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హలో విద్యార్థి చలో వరంగల్” అనే నినాదంతో సభను విజయవంతం చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. గ్రూప్-1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయని.. వెంటనే నియామక ప్రక్రియను నిలిపివేసి నూతన నోటిఫికేషన్తో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఈనెల 27 న జరగబోయే బీఆర్ఎస్ సభలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్, శ్రీకాంత్, ప్రభాకర్, పృథ్వి రె డ్డి, మల్లేశ్, జయంత్, బస్వరాజు, యుగేందర్, శివశంకర్, హరీష్, వీరే శ్, సంతోష్, వెంకట్ పాల్గొన్నారు.