హైదరాబాద్ గాంధీ భవన్: ఓట్ల చోరీకి పాల్పడి పలు రాష్ట్రాల్లో గద్దెనెక్కిన బీజేపీ(Bjp)ని కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్ లో “ఓటు చోర్ – గద్దీ చోడ్” ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ అనుమతితో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓట్ల దొంగతనాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి (Boyalapally Rekha) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేఖ బోయలపల్లి గారు మాట్లాడుతూ.. “ప్రధాని మోడీ అధికారం అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మహారాష్ట్రలో భారీగా ఓటర్లను అక్రమంగా జాబితాలో చేర్చడంతో పాటు బీహార్లో 60 లక్షల పైగా ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఓట్లు చేర్చడం వంటివి ఓటు చోరీకి నిదర్శనాలు.
ఓట్ చోరీ అనేది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన దాడి. ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వం ఈ కుట్రకు బాధ్యత వహించాలి. ఇకపై అయినా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.