బేగంపేట్ ( హైదరాబాద్ ) : కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత డాక్టర్ సూదిని జైపాల్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్(Congress) పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు. మంగళవారం జైపాల్‌రెడ్డి 82వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ‘స్పూర్తి స్థల్’లో ఆయన సమాధి వద్ద మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి పాటించిన నైతిక విలువలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన హైదరాబాద్‌కు మెట్రోరైలు(Metro Train), కల్వకుర్తి(Kalvakurthi) ఎత్తిపోతల పథకం, పాలుమూరు (Palamur) జిల్లా సస్యశ్యామలం కావడానికి ప్రత్యేక చొరవ చూపారని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని, ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.