అమీర్‌పేట్, డిసెంబర్ 28: ఎస్ఆర్నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్వవస్థాపక దినోత్సవ సంబురాలు కొత్త సమస్యలకు తెరలేపాయి. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన శిలాఫలకాన్ని ఏకంగా రోడ్డు డివైడర్‌పై ఏర్పాటు చేసిన తీరు చర్చనీయాంశమైంది. పౌరులను ఇబ్బందులకు గురిచేయరాదన్న కనీస ఆలోచన లేకుండా కాంగ్రెస్ నాయకులు ఎస్ఆర్నగ్ర్లోని దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి కొద్ది అడుగుల దూరంలో రోడ్డు డివైడర్ యూ టర్న్‌కు ఆనుకుని మూడు ఫీట్ల మేర శిలాఫలకాన్ని నిర్మించారు.
అధికార పార్టీ కావడంతో తామేం చేసినా చెల్లుబాటవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులే ఈ విధంగా రోడ్లను తమ ప్రయోజనాలకు వాడుకోడం పట్ల ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. డివైడర్‌ను ఆక్రమించి శిలాఫలకాన్ని నిర్మించడం ద్వారా వాహనదారులకు ఏర్పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అమీర్‌పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, అటువంటి రోడ్డు మీద డివైడర్లను ఆక్రమించి కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం సరైంది కాదని మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి విమర్శించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులకు గురిచేసేలా శిలాఫలకం ఏర్పాటు సరికాదన్నారు.