MLA Muthagopal | చిక్కడపల్లి, సెప్టెంబర్ 12: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
గురువారం గాంధీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గూండా రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఇటీవలే ఖమ్మంలో మాజీ మంత్రులు హారీశ్‌రావు తదితరులపై కూడా దాడి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే ఇంటిపైకి వచ్చి దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.