Jawaharnagar | జవహర్‌నగర్, మార్చి 18: భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్ జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల కొల్లగొట్టడంతో ఆరితేరిన వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ డబ్బున్నోళ్లకే ప్రాధాన్యం ఇస్తూ..అసలైన కాంగ్రెస్‌వాదులకు అన్యాయం చేయడం దుర్మార్గమని చెప్పారు. కాగా, కార్పొరేషన్ గేటు ఎదుట నిరసన తెలిపిన అనంతరం వారు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఎదుట దీక్షను ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పేవరకు తాము దీక్ష విరమించమని స్పష్టం చేశారు. అయితే సాయంత్రం మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్ దవ్, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్ వచ్చి నిహారిక, శంకర్‌గౌడ్‌లతో మాట్లాడి దీక్ష విరమింప
జేయించారు.