మల్లాపూర్, అక్టోబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మీర్పేట్ డివిజన్ ఎన్టీఆర్నగర్లో బీఆర్ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు వాసుచారి, బి.శ్రీనివాస్, పి. నరేశ్ గౌడ్, భీష్మాచారి, నాగేశ్, భాస్కర్, జయమ్మ, లలిత, లక్ష్మి, కమలమ్మ, మరియమ్మ, భాగ్యలక్ష్మి, గౌసియా, చంద్రకాంత్, పరమేశ్ గిరి, నర్సింగ్‌రావు, నర్సింహ, శ్రీకాంత్, విశాల్, రాములు, యాదయ్య, చెన్నయ్య, రాములు, రాజేశ్, సుమారు రెండు వందల మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జె. ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, జి. శ్రీనివాస్‌రెడ్డి, మారుతీరావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వీడి.. బీఆర్ఎస్లోకి..
25 ఏండ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన నాచారం ఎర్రగుంటకు చెందిన 200 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్‌శేఖర్ తదితరులు పాల్గొన్నారు.