బడంగ్పేట్, సెప్టెంబర్11: ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్లో గతంలోనే మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి కాంగ్రెస్ నాయకులు కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభిస్తున్నారంటే మంత్రిని కూడా అవమానించినట్లు అవుతుందన్నారు. మాజీ కార్పొరేటర్లుగా పోతే ప్రొటోకాల్ అడ్డం వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాటికి ప్రొటోకాల్ ఉండదా అని ఆమె ప్రశ్నించారు. ఇదంతా కమిషనర్ సరస్వతి అండదండలతో జరుగుతుందన్నారు. అధికార పార్టీకి తొత్తుగా మారిందన్నారు. ఈ విషయం పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.