మియాపూర్, నవంబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా విధ్వంసమే తప్పితే అభివృద్ధి శూన్యమని ఏ వర్గం వారు సంతృప్తికరంగా లేరని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయకుండా ఏడాది పాలనపై జరుకుంటున్నది విజయోత్సవం కాదని.. అది సంవత్సరీకమని దుయ్యబట్టారు. నియోజకవర్గ పార్టీ శ్రేణుల కఠోర శ్రమతో ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ పార్టీ మారి తీవ్రమైన మోసం చేశారని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని శంభీపూర్‌రాజు డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఆల్విన్‌కాలనీ డివిజన్లోని గోదా ఫంక్షన్ హాల్లో పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి సతీశ్‌రావు ఆధ్వర్యంలో జరిగింది. కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ, జగన్, మంత్రి సత్యనారాయణ సహా పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం సహా రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కేవలం బీఆర్ఎస్, పార్టీ శ్రేణులను తిట్టడమే పనిగా పెట్టుకున్నదన్నారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఏ పథకాన్ని అమలు చేయడంలేదని శంభీపూర్ రాజు విమర్శించారు. నియోజకవర్గ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ తన స్వార్థం కోసం పార్టీ మారాడని, తక్షణమే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… తన రాజకీయ ప్రస్థానం ఈ నియోజకవర్గం నుంచే మొదలైందని, ప్రజల ఆదరాభిమానాలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానన్నారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని, ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు తానే ముందుంటానని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లిలో నాయకులే కాంగ్రెస్‌లో చేరారే తప్ప బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ పార్టీ మారలేదని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ను కార్యకర్తల మద్దతుతో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో అంతటా విధ్వంసమే తప్ప అభివృద్ధి లేదని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్‌రావు, సంతోష్‌రావు, రాములు గౌడ్, సమద్, ఖాజా, జగదీష్, సాయిగౌడ్, మనీష్ గౌడ్, మహేశ్, నాగేశ్వర్రావు, మాచర్ల భద్రయ్య, గోపరాజు శ్రీనివాస్, కిరణ్ యాదవ్, రోజా, శ్రీను, శంకర్, లక్ష్మణ్, శ్రీనివాస్, రామస్వామి, పాండు, నాగేశ్వర్రావు, జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.