కాంగ్రెస్ పోటీయే కాదు..
మల్కాజిగిరిలో కాంగ్రెస్ మాకు పోటీయే కాదని, బీజేపీకి గెలిచే సత్తాలేదని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్, నాచారం డివిజన్ల సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.
- మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి
ఉప్పల్: మల్కాజిగిరిలో కాంగ్రెస్ మాకు పోటీయే కాదని, బీజేపీకి గెలిచే సత్తాలేదని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్, నాచారం డివిజన్ల సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి గడపను తట్టి, ఓటరును కలుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన స్ఫూర్తితోనే ఎంపీ ఎన్నికల్లోనూ పనిచేయాలన్నారు.కాంగ్రెస్ నెరవేర్చాలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జి జహంగీర్‌పాషా అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, నేతలు ముత్యంరెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

