కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని విజయవంతంగా నిర్వహించింది. రోడ్లపై ఎక్కడ ఏ చిన్న గుంత పడినా వెంటనే పూడ్చింది. ప్రయాణం సాఫీగా సాగడానికి తక్షణమే చర్యలు తీసుకున్నది. రోడ్ల మధ్య డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, పచ్చదనం పెంపు తదితర పనులు చేపట్టారు. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించారు. పధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించారు. తొలి విడతగా 744 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1,900కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ రోడ్ల నిర్వహణ పథకాన్ని ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయి.
-ఫీచర్ స్టోరీ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయ్యింది. రోడ్ల నిర్వహణ అధ్వానంగా మార్చేసింది. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని నిర్వీర్యం చేసింది. నిర్వహణ లోపం..గుంతలమయం, ఎగుడు దిగుడు నడుమ నగర ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. మొదటి దశ సీఆర్ఎంపీ నిర్వహణలో భాగంగా ఏజెన్సీల గడువు గత జనవరి నెలలో ముగిసింది. దాదాపు ఏడాది కావొస్తున్నా సీఆర్ఎంపీ మొదటి దశ నిర్వహణ, రెండో దశ ప్రతిపాదనలకు మోక్షం దక్కలేదు. అన్ని జోన్లలోని మెయిన్ రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రూ.2,828 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు నేటికీ సరారు వద్దే పెండింగ్‌లో ఉంచింది. నగర ప్రజలతో ఆటలాడుకుంటున్నది.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి రాగా..రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలోనే సీఆర్ఎంపీ రోడ్లపై సాఫీ ప్రయాణం ఒకప్పటి మాట..కానీ ప్రస్తుతం అడుగడుగునా నిర్వహణ లోపం..గుంతలమయం, ఎగుడు దిగుళ్ల నడుమ ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది..అంతేకాదు రోడ్ల మధ్య డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనులతో పాటు పారిశుధ్య నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నారు.
అంతేకాకుండా మొదటి దశ సీఆర్ఎంపీ నిర్వహణలో భాగంగా ఏజెన్సీల గడువు గత జనవరి నెలలో ముగిసింది. దాదాపు ఏడాది కావొస్తున్న సీఆర్ఎంపీ మొదటి దశ నిర్వహణ, రెండో దశ ప్రతిపాదనలకు మోక్షం దక్కలేదు. అన్ని జోన్లలోని మెయిన్ రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రూ.2,828 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు నేటికీ సరారు వద్దే పెండింగ్‌లో ఉండడం గమనార్హం. నెలల తరబడి సరారు వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నందున రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గుంతలు లేని రహదారుల లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి తొలి విడుతగా 744 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020 సంవత్సరంలో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1900 కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఆర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు.
ఇటువంటి పథకాన్ని కాంగ్రెస్ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను పక్కన పెట్టడం, కనీసం మొదటి దశ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహణ చేపట్టకపోవడం గమనార్హం. కాగా సీఆర్ఎంపీ మొదటి దశలో భాగంగా రోడ్ల నిర్వహణ బాధ్యతలు గత జనవరి నెలలో ఏజెన్సీల నిర్ణీత గడువు ముగిసింది. దీంతో ఫుట్‌పాత్‌ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, కెర్భ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతూ వస్తున్నది. మొదటి దశతో పాటు రెండో దశ కలిపి రూ. 2,828 కోట్ల రోడ్ల నిర్వహణ పనులకు ప్రతిపాదనలు అందజేసినా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
