స్నాక్స్‌లోనూ సర్కార్ వివక్షే
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.
- పీఎంశ్రీ స్కూళ్లకు 34 రోజులు
- ఇతర ప్రభుత్వ బడులకు 19 రోజులే
- విద్యాశాఖ నిర్ణయాలపై టీచర్ల అభ్యంతరం
- ఇప్పటికైనా సవరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. పీఎంశ్రీ స్కూళ్లల్లో 34 రోజులు స్నాక్స్ ఇవ్వాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 19రోజులే ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ ఇచ్చిన వివక్షాపూరిత ఆదేశాలపై టీచర్లు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న విషయం తెలిసిందే.
విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా స్పెషల్ క్లాసులను నిర్వహిస్తుంటారు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా స్నాక్స్ సమకూర్చడం ఆనవాయితీగా వస్తున్నది. తాజాగా పీఎంశ్రీ సూళ్లల్లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు పాఠశాల విద్యాశాఖ అనుతిచ్చింది. ఈ బడుల్లో జనవరి 28 నుంచి మార్చి 10 వరకు మొత్తం 34రోజుల పాటు స్నాక్స్‌ను సమకూర్చాలన్నది. రాష్ట్రంలో 532 పీఎంశ్రీ స్కూళ్లున్నాయి. వీటిల్లో 46,221 మంది పదో తరగతి చదువుతున్నారు. సాయంత్రం స్పెషల్‌క్లాసులు నిర్వహిస్తున్నందున రూ.2.35 కోట్ల స్నాక్స్ బడ్జెట్‌ను కూడా సర్కారు మంజూరుచేసింది.
సర్కారు స్కూళ్లకేమో 19 రోజులే..
జిల్లా పరిషత్, ప్రభుత్వ, మాడల్ స్కూల్స్‌లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు అనుమతినిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు కేవలం 19 రోజులకు స్నాక్స్‌ను సమకూర్చాలని ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 4,303 స్కూళ్లల్లో 1,48,461 విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున 19 రోజుల పాటు సమకూర్చేందుకు స్నాక్స్ కోసం రూ.4.23 కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. అయితే సౌకర్యాలు, నిధుల విడుదల విషయంలోనూ సర్కారు బడులకు ఒక విధంగా, పీఎంశ్రీ స్కూళ్లకు మరోలా విడుదల చేస్తున్నారని, ఇదే తీరును స్నాక్స్ విషయంలోనూ చూపడం అత్యంత దారుణమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. స్నాక్స్ విషయంలో వ్యత్యాసం చూపడం తగదని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

