బొల్లారం(హైదరాబాద్) : కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలకు(Diversion politics) పాల్పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy ) ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో శాంతి భద్రలకు(Law and Order) విఘాతం కలిగించే చర్యలకు పూనుకుంటుందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడీ గాంధీ, తన అనుచరులతో కలిసి దాడిచేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిని బోయిన్పల్లి నివాసంలో శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో శాంతి భధ్రతలకు విఘాతం కలిగించడం సిగ్గుచేటని అన్నారు.
కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఇంటిని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి పాలన చేతకాక ఇచ్చిన హామీలను నెరవేర్చక డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంటే అరికెపుడి గాంధీని ఆపితే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదన్నారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే ఇంటిపైకి దౌర్జన్యంగా వెళ్లి దాడి చేసిన సందర్భం ఇంతకు ముందు లేదన్నారు. ఎమ్మెల్యే గాంధీ ఫ్యాక్షనిజం మాదిరిగా గుండాలతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి సంఘీభావంగా తెలిపేందుకు వెళ్లిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల్లో అక్రమంగా నిర్భందిస్తున్నారని మండిపడ్డారు.
Congress Government, Diversion politics , Promises, Former minister, Mla Mallareddy, Law and Order, BRS Mla,Kaushik Reddy, MLA Gandhi