సికింద్రాబాద్, జులై 7: డివిజన్లో నెలకొన్న పెండింగ్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డీసీ దశరథ్తో పాటు పలు శాఖల అధికారులతో పలు అంశాలపై కార్పొరేటర్ హేమ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న బోనాలు, బక్రీద్ వంటి పండుగ నేపథ్యంలో డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అసలే వర్షాకాలం ఆరంభం కావడంతో నాలా పరివాహక ప్రాంతాల్లో రక్షణ చర్యలపై అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఆదే విధంగా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు శిధిలావస్థలో ఉన్న భవనాలు గుర్తించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందుబాటులో ఉండాలి అని అధికారులను ఆదేశించారు.