ముషీరాబాద్/బంజారాహిల్స్/కేపీహెచ్‌బీ కాలనీ/ వెంగళరావునగర్/కుత్బుల్లాపూర్,మార్చి11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ జాహంగీర్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌కి మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, టెంట్‌హౌస్ శ్రీనివాస్, శివముదిరాజ్, శ్రీధర్‌చారి తదితరులు పాల్గొన్నారు.