సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ): ఆక్రమణలకు గురైన చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ట్రై సిటీ పరిధిలోని చెరువులను ఆక్రమించడంతో పాటు అక్రమంగా జరిగిన నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, రిపోర్టు ఆధారంగా అక్రమార్కులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.