GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిటీ ప్లానర్స్, ఏసీపీలకు స్థానచలనం కల్పిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్‌గా శ్యామ్, ఎల్బీనగర్ జోన్ సిటీ ప్లానర్‌గా శ్రీనివాస్ యాదవ్, చార్మినార్ జోన్ సీపీగా మాజీద్, కూకట్పల్లి సిటీ ప్లానర్‌గా గణపతి, ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోని చార్మినార్ సెక్టార్‌కు సిటీ ప్లానర్‌గా ఉమాదేవి, అడిషనల్ సీసీపీ వెంకన్నకు ప్రధాన కార్యాలయంలోని ఖైరతాబాద్ జోనల్ బాధ్యతలు అప్పగించారు.
వీరితో పాటు పలువురు ఏసీపీల బదిలీలు జరిగాయి. చందానగర్‌కు నాగిరెడ్డి, జూబ్లీహిల్స్‌కు శ్రీనివాస్, మల్కాజిగిరికి శ్రీనివాసరావు, ఎల్బీనగర్కు ప్రతాప్, మలక్‌పేటకు గజానందం, చాంద్రాయణగుట్టకు భానుచందర్, ఫలక్‌నుమాకు మంజులాసింగ్, చార్మినార్‌కు రాందాస్, ముషీరాబాద్‌కు దేవేందర్, అంబర్‌పేటకు సుమి త్ర తదితర ఏసీపీలకు ఆయా స్థానా ల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. అలాగే పలు చోట్ల టీపీఎస్లనూ మారు స్తూ.. నిర్ణయం తీసుకున్నారు. అలాగే 27 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు డిప్యూటీ ఈఈలను పలు సర్కిళ్లకు మార్చారు.
ఇవి కూడా చదవండి
హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద.. దిగువకు నీటి విడుదల
సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : నగరంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 అడుగులు కాగా, శనివారం ఉదయం వరకు 513.53 వరకు చేరింది. దీంతో నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2075 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1538 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.