బండ్లగూడ, మే18: మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ విలువలకు ఇంటి పన్నుకు ముడిపెట్టి లెక్కించడం వల్ల ఇంటిపన్నులు అధికం అవుతున్నాయని, ఇది నిరుపేదలకు సమస్యగా మారుతున్నదని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తమ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమస్యను వివరిస్తూ.. లేఖ రాశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెస్మెంట్, రిజిస్ట్రేషన్‌కు లింక్‌ను తీసివేసి.. గతంలో ఉన్న మాదిరిగానే ఇంటి పన్నులను లెక్కించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ కాలనీ ఫెడరేషన్ సభ్యులు నరేందర్‌బాబు, నదీం, వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.