సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతుండడంతో గత రెండు మూడు రోజులుగా చలిపులి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో సాయంత్రం నుంచే చలి మొదలై, రాత్రి, తెల్లవారుజాము వరకు వణుకు పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని రాజేంద్రనగర్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 11.0 డిగ్రీలు, హకీంపేటలో 13. 7, నగరంలో 14.2 డిగీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.