చార్మినార్, నవంబర్ 15 : నగరంలో ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో జూపార్క్‌లోని వన్యప్రాణులు తట్టుకోలేక పోతున్నాయి. అందరిని తన రాజా ఠీవీతో భయపెట్టే పెద్దపులి సైతం చలి కారణంగా గదిలోని ఓ మూలకు చేరి నక్కిపోతుంది.
వన్యప్రాణుల ఇబ్బందులను గుర్తించిన జూ పార్క్ అధికారులు జంతువులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులి గదిలోకి వేడి గాలులు చేరే విధంగా రూం హీటర్లను అమర్చుతూ వాటికి సేద తీరుస్తున్నారు. మరో వైపు ఇతర జంతువుల ఎన్క్లోజర్ల చుట్టూ గన్నీ బ్యాగులు అమరుస్తూ చలి గాలులు ఎన్క్లోజర్లలోకి చొరబడకుండా రక్షణ చర్యలు
తీసుకుంటున్నారు. అదే సమయంలో వాటి ఆహారంలో తగిన మార్పులు చేస్తూ సులువుగా జీర్ణమయ్యే పదర్థాలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు.