చలిగాలులు గ్రేటర్ వాసులను వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి సాధారణ స్థాయికంటే తక్కువకు క్షీణిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 9.4డిగ్రీల సెల్సియస్, రామచంద్రాపురంలో 10.5డిగ్రీలు, చందానగర్లో 11.2డిగ్రీలు, రాజేంద్రనగర్లో 12.0 డిగ్రీల చొప్పున నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా గరిష్ట ఉష్ణోగ్రతలు 29.4డిగ్రీలు, గాలిలో తేమ 42శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. – సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)