Coacine | కాచిగూడ, మార్చి 24 : గుట్టుచప్పుడు కాకుండా కొకైన్ అమ్ముతున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ టీ జోత్స్న, డిఐ సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన గాడ్విన్ ఐఫెనహి(34) నగరంలోని వివిధ కేసుల్లో పాత నేరస్తుడు. కొంత కాలంగా కాచిగూడ రైల్వే స్టేషన్ పార్శిల్ కార్యాలయం సమీపంలో ఇద్దరు స్నేహితులతో కలిసి గాడ్విన్ దొంగచాటుగా కొకైన్ అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొకైన్‌ను విక్రయిస్తున్న గాడ్విన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీసులకు అప్పగించారు. అతని నుంచి రూ. 42 వేల విలువ చేసే 7 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సోమవారం గాడ్విన్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు.