సంప్రదాయ చీరకట్టులో తళుక్కున మెరిసిన సినీ నటి కృతిశెట్టి బుధవారం ఉప్పల్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఇలా సందడి చేసింది.
ఉప్పల్, అక్టోబర్ 4 : ఉప్పల్‌లోని సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి కృతిశెట్టి షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. దీంతో అభిమానులు, కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. సినీనటి కృతిశెట్టి పలు వస్ర్తాభరణాలను పరిశీలించి, వాటిని ప్రదర్శించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకుడు ఎంవీ.రమణ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులతో షాపింగ్‌మాల్ సందడిగా మారింది.
Cmr