సిటీబ్యూరో, అక్టోబర్ 09(నమస్తే తెలంగాణ): విద్యుత్ అధికారుల బస్తీబాటతో క్షేత్రస్థాయిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో ఉన్న చిన్నచిన్న లోపాలు బయటపడుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. గురువారం మెహదీపట్నం డివిజన్లో విద్యుత్ అధికారులు నిర్వహిస్తున్న బస్తీబాట కార్యక్రమాన్ని సీఎండీ ఆకస్మిక తనిఖీలు చేశారు.
డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్, జాన్దర్కాలనీ, సంతోష్‌నగర్, రేతిబౌలి ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ విద్యుత్ పంపిణీ తీరును తనిఖీ చేశారు. ప్రమాదకరంగా ఉన్న ఎల్టీ ఓవర్‌హెడ్ కండక్టర్ల స్థానంలో ఏబీ కేబుల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆపరేషన్స్ డైరెక్టర్ డా.నర్సింహులు, మెట్రోజోన్ సీఈ ప్రభాకర్, సెంట్రల్ సర్కిల్ ఎస్ఈ వెంకన్న, డీఈ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.