ఐటీ కేంద్రమైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు 1.2 కిలో మీటర్ల మేర రూ.182 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
పనులు పూర్తికావడంతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.
-సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ)