ఐటీ కారిడార్‌లోని గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి, శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేయడంతో పాటు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించేందుకు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 2021లో అప్పటి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ హయాంలోనే వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభానికి నోచుకోలేకపోయింది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడు నెలలైనా..ప్రారంభించకుండా తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మాణం పూర్తయిన గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి.. వాహనదారులకు సౌకర్యాలను మెరుగుపరచాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు శనివారం ఫ్లై ఓవర్‌ను అధికారికంగా ప్రారంభించారు.
– సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ)