సిటీ బ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవన. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రుకవారం మూసీ పునరుజ్జీవనంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. .
సింగపూర్‌లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్తో పాటు మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సిటీ బ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రుకవారం మ్రెటో విస్తరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దాకా 40 కిలోమీటర్లు మ్రెటోను విస్తరించేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ మ్రెటోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.