Harish Rao | దివ్యాంగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేసినవా..? రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అమలు చేస్తే అదేందో ఒకటి చెప్పు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అడిగారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హస్తినాపురంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, దివ్యాంగుల హక్కుల సాధనకై నిర్వహించిన ‘సమర శంఖారావం’లో హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నువ్వు ఉచిత బస్సు అన్నవ్.. 6 వేల రూపాయల పెన్షన్ అన్నవ్.. మోసం చేసినవ్.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పిస్తా అన్నవ్.. దగా చేసినవ్. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అని.. ఇవాళ్టికి ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మెల్లగా ఎగ్గొడతా.. చివరకు ఎన్నికలకు 6 నెలల ముందు ఇస్తా అనుకుంటున్నడు.. అంటే ఆయనకే తెలివి ఉందా.. మనకు లేదా..? అని హరీశ్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చి 33 నెలలు అయింది.. నువ్వు నిజంగా ఒక్కొక్కరి రూ.6 వేల చొప్పున లెక్కపెడితే ఈ రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ పడ్డవ్ బిడ్దా అని హరీశ్ రావు హెచ్చరించారు. ఆ 66 రూపాయలు ఇచ్చినంకనే లెక్క.. లేకుంటే అప్పటిదాకా నువ్వేం చేసినా దివ్యాంగులు నిన్ను నమ్మరు కాక నమ్మరు. నువ్వు ఎన్నికలు దగ్గర పడ్డంక మెల్లగా ఇస్తే మరిచిపోతరనుకుంటున్నవా..? 6 నెలల ముందు ఇస్తా.. 3 నెలల ముందు ఇస్తా.. మరిచిపోతరనుకుంటుండు రేవంత్ రెడ్డి.
పైసల్లేకనా.. పైసల్లేక కాదు.. రేవంత్ రెడ్డి మనసు లేక దివ్యాంగులను మోసం చేస్తా ఉన్నడు. రేవంత్ రెడ్డి దగ్గర అందాల పోటీ పెట్టేందుకు వేల కోట్లు ఉంటయి. నీ ఫుట్ బాల్ సోకులు తీర్చుకునేందకు వందల కోట్లు ఖర్చు పెడతవ్ రేవంత్ రెడ్డి. ప్యూచర్ సిటీకి లక్ష కోట్లు పెడతవ్. మూసీ సుందరీకరణకు లక్ష కోట్లు ఖర్చుపెట్టేందుకు నీ దగ్గర దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా రేవంత్ రెడ్డి బొమ్మలేసుకుని పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేసుకునేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు నీ దగ్గర డబ్బులుంటయి. బడా బడా కాంట్రాక్టర్లకు వేల వేల కోట్లు కమీషన్ల బిల్లులు ఇచ్చేందుకు నీదగ్గర డబ్బులుంటయని ఫైర్ అయ్యారు.
సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపికలు
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!