Donald Trump | హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న 100 మీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయనుంది.
ఐటీ కారిడార్లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ల పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు, హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రహదారులపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు
గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు
ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు
గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు
హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు… pic.twitter.com/g09kJf6FIf
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2025