అబిడ్స్, మార్చి 8 : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిశోర్ వ్యాస్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నందకిశోర్ వ్యాస్ కార్యాలయంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి చీరలను పంపిణీ చేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి పాటుపడుతూ వస్తున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. డ్వాక్రా గ్రూప్‌లకు వడ్డీ లేని రుణాలు ప్రవేశపెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు శీలం సరస్వతి, ప్రియాగుప్తాలను సన్మానించారు. కార్యక్రమంలో పి. అనిత, పుష్ప లింగాయత్, సంతోషి, రుచి మిత్ర, అరుణ, లత పాల్గొన్నారు.
టీఎస్ఆర్టీసీని ఆదరించడం అభినందనీయం
కోఠి బస్ టర్మినల్లో మహిళా దినోత్సవ వేడుకలు ముషీరాబాద్ డిపో ఆధ్వర్యంలో బుధవారం కోఠి బస్ టర్మినల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్ ముదిగొండ భవాని, ట్రాఫిక్ డీసీపీ పీఏ అనురాధ 25 ఏండ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న 8 మంది మహిళా ప్రయాణికులు, ఉత్తమ మహిళా కండక్టర్లను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ సందర్భంగా టర్మినల్లో నిర్వ హించిన రంగోళి, మ్యూజిక్ చైర్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన మహిళా కండక్లర్లను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.కిషన్‌రావు మాట్లాడుతూ.. ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా టీఎస్ఆర్టీసీ కృషి చేస్తుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్, మహిళా విద్యావేత్త ముదిగొండ భవాని, ట్రాఫిక్ డీసీపీ పీఏ అనురాధ, డాక్టర్లు స్నేహలత,సంతోషిలను సన్మానించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ముషీరాబాద్ డిపో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ వి.కల్యాణి, జ్యోతికా రాణి, ఎంఎఫ్ చందర్, నర్సి ంగ్రావు, జేజే రెడ్డి, ఏడీసీలు బి.వి. గుప్త,సీస నర్సయ్య గౌడ్,సీఆర్సీ ఎస్.ఎన్. చారి, కండక్టర్ రమేశ్ పాల్గొన్నారు.