ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్/శామీర్‌పేట/మేడ్చల్ కలెక్టరేట్/ కీసర/జవహర్‌నగర్,అక్టోబర్,17: మేడ్చల్ నియోజకవర్గ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని జవహర్‌నగర్ మేయర్ కావ్య, కీసర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్,తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, ఘట్కేసర్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.