వెలుగుల రేడు ముఖ్యమంత్రి కేసీఆర్
దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 111జీవో ఎత్తివేతపై సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో
111 జీవో ఎత్తివేతకు కేబినెట్ ఆమోదంపై సర్వత్రా హర్షం
84 గ్రామాల్లో వెలుగును ప్రసాదించిన సీఎం కేసీఆర్
చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 13: దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 111జీవో ఎత్తివేతపై సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 111 ఎత్తివేతకు కేబినెట్లో ఆమోదం తెలిపారని చెప్పారు.

84 గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి, న్యాయ నిపుణులతో చర్చించి జీవో ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కొంతమంది ప్రతిపక్షాల నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ 84 గ్రామాల ప్రజలకు శాపంగా ఉన్న జీవో 111ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గణేశ్‌గుప్త, మున్సిపల్ చైర్మన్లు సుష్మ, రేఖయాదగిరి, మేయర్ మహేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ బండిగోపాల్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

