బీజేసీకి ఓటు వేసేందుకు పిచ్చిపోసిగాళ్లమా..
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు...కనీసం ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు. వంద లేఖలు రాసినా నరేంద్రమోదీ ఒక్కటియ్యలె. మరి బీజేపీకి మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి.
- నరేంద్రమోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలె..
- తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలె..
- మరి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలె
- కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేంద్రం కుట్రలు
- 58 ఏండ్లు పడ్డ గోసలు గుర్తుకొస్తలేవా ?
- మంచినీళ్ల బాధలు మర్చిపోయామా ?
- కాంగ్రెస్ రాజ్యంలో మాట్లాడితే కర్ఫ్యూ..
- పదేండ్లలో ప్రశాంతంగా ఉన్నాం
- దేశానికే రోల్ మోడల్‌గా రాష్ర్టాన్ని చేసుకున్నాం
- తెలంగాణ తెచ్చిన కీర్తే ఆకాశమంత ఎత్తు
- రేపటి తెలంగాణ కోసమే నా పోరాటం
- మళ్లీ ఆశీర్వదించండి.. గజ్వేల్ గౌరవాన్ని పెంచుతా..
- ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు…కనీసం ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు. వంద లేఖలు రాసినా నరేంద్రమోదీ ఒక్కటియ్యలె. మరి బీజేపీకి మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి. మనం ఏమన్న పిచ్చి పోసిగాళ్లమా..? మేం ఏం ఇవ్వకున్న మాకే గుద్దిండ్రు.. వీళ్లు గొర్రెలు అనుకుంటరు. మరి మనం గొర్రెలమా ? మనం ఎవరిమనేది 30 తారీఖున ఓటేసి నిరూపించాలి.’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రోజైన మంగళవారం సీఎం కేసీఆర్ తాను ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే.. ఆ అంటే.. మతకల్లోలం. మాట్లాడితే కర్ఫ్యూలు. 58 ఏండ్లు పడ్డ గోసలు గుర్తుకొస్తలేవా ? మంచినీళ్ల బాధలు మర్చిపోయామా ? కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేండ్ల నుంచి అభివృద్ధికి సహకరించకుండా, కుట్రలు చేస్తున్న కేంద్రానికి ఎందుకు సహకరించాలని ఆయన ప్రశ్నించారు.

పదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క కర్ఫ్యూ లేదు… ప్రశాంత వాతావరణం ఉంది. ప్రతి యువకుడు ఆలోచించి విచక్షణతో ఓటేస్తే లాభం జరుగుతదని అన్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తే తనకు ఆకాశమంత ఎత్తు అని, వందశాతం అక్షరాస్యత కలిగి, పేదరికం లేని రేపటి తెలంగాణ కోసమే నా పోరాటమని చెప్పారు. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే.. గజ్వేల్ ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

